‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ స్టార్ట్.. కంటెస్టెంట్స్ ఎవరంటే?
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో సక్సెస్ అయిన రియాలిటీ షోస్‌లో ఒకటి ‘బిగ్ బాస్’. బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ షో కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తుండడం మనం చూడొచ్చు. తెలుగులో ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకోగా రేపు(సెప్టెంబర్ 5) సీజన్ ఫైవ్ షురూ కానుంది. దీంతో వ్యుయర్స్ ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సీజన్ ఫైవ్‌కి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో పార్టిసిపెట్ చేయబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. లిస్ట్ ఫైనల్ అయిందట. కొద్ది రోజులుగా తాజ్ డెక్కన్, మారియట్ హోటల్స్‌లో క్యారంటైన్లో ఉన్న పార్టిసిపెంట్స్ ప్రజెంట్ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ప్రవేశపెడుతున్నారని తెలుస్తోంది. ఇవాళ కంటెస్టెంట్స్ ‘బిగ్‌బాస్’ హౌస్ ఎంట్రీ పూర్తి కానుంది. ఇక రేపు సాయంత్రం ‘బిగ్ బాస్’ ప్రసారం కానుంది.
కాగా హౌస్‌లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్.. యూట్యూబర్ సరయు, సీరియల్ హీరో మానస్, యానీ మాస్టర్, యాంకర్ రవి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి, లోబో అని తెలుస్తోంది. ఇకపోతే ఈ రియలిటీ షోకు గతంలో సీజన్ వన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. సెకండ్ సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించగా, మూడు, నాలుగు, ఐదు సీజన్లకు అక్కినేని నాగార్జుననే హోస్ట్. థర్డ్ సీజన్లో బాహుబలి తల్లి ‘రాజమాత’ రమ్యకృష్ణ మెరిసింది. ఫోర్త్ సీజన్లో అక్కినేని వారి కోడలు బ్యూటిఫుల్ సమంత కూడా ఓ వీకెండ్లో ‘బిగ్ బాస్’లో సందడి చేసింది. ఈ సారి సీజన్ ఫైవ్‌లో గతంతో పోల్చితే చాలా భిన్నమైన టాస్కులు కంటెస్టెంట్స్‌కు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.