Bigg boss day one : మొదటిరోజే టాస్కులతో రచ్చ..
గ్రాండ్‌గా షురూ అయిన బిగ్‌బాస్..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో ఆదివారం సాయంత్రం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పెద్ద రియాల్టీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్ అదే స్థాయిలో ఐదోసారి కూడా గ్రాండ్ గా షూరూ అయ్యింది. కండ్లు మిరిమిట్లు గొలిపే స్టేజ్ పై కింగ్ నాగార్జున స్టైలిష్ లుక్‌లో అబ్బురపరిచే డాన్స్ లతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ వయస్సులో కూడా నాగ్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తూ అటు మాస్ ఇటు క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా డ్యాన్స్ చేస్తే అంతా ఫిదా అయ్యారు. ఇక ఒక్కొక్కరుగా హౌస్ లో అడుగు పెట్టి నానా హంగామా చేశారు. కాగా వీరిలో కొంత మంది కొద్ది రోజులుగా ప్రచారంలోఉన్న వారే కావడం గమనార్హం.
ఎప్పటిలాగే ఈసారి కూడా వివిధ రంగాలకు చెందిన వారు కంటెస్టెంట్స్ గా వచ్చారు. అయితే ఇందులో మెయిన్ గా బుల్లి తెర స్టార్లు అలాగే యూట్యూబ్ స్టార్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సారి మొత్తం 19 మందితో మొదటి రోజే హౌస్ ఫుల్ అయిపోయింది. ఒకొక్కరుగా తమదైన డ్యాన్సులతో అదరగొట్టారు. ఇక కంటెస్టెంట్స్ విషయంలో కొందరి ముఖాలు నెటిజన్లకు ఆనందం కలిగించగా.. కొందరు విషయంలో నెటిజన్లు అభిమానులు అన్ హ్యాపీగా ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇందులో యాంకర్ రవి చాలా స్పెషల్ గా నిలుస్తాడని కూడా అంటున్నారు. కాగా మొదటి రోజు గత సీజన్ ల్లో లెఆంటి టాస్క్ లు లేవు. కానీ ఈసారి రొటీన్‌కు భిన్నంగా మొదటి రోజు టాస్క్ తో అలరించింది బిగ్ బాస్. హౌస్ లో కంటెస్టెంట్లకు ఇచ్చే రెండు సింగిల్ బెడ్స్ ను లాక్ చేసిన బిగ్ బాస్ అందులో ఒకటి కావాలనుకున్న వారికోసం టాస్క్ ను పెట్టారు. కాగా ఇందులో నలుగురు కంటెస్టెంట్స్ గెలిచారు. విశ్వ గెలవగా ఆ బెడ్‌ను ట్రాన్స్ జెండర్ ప్రియాంక కు ఇచ్చేశాడు. ఇక ఇందులో యూ ట్యూబ్ స్టార్ సిరి హనుమంతు, సీరియల్ హీరో వీజే సన్నీ, యాక్టర్ లహరి, శ్రీరామ చంద్ర, ఆనీ మాస్టర్, లోబో, ప్రియా, మోడల్ జెస్సీ ఒక స్థాయి స్టార్లుగా అడుగు పెట్టారు. కాగా ట్రాన్స్ జెండర్ ప్రియాంకకు చాన్స్ ఇవ్వడం ఈ సారి మరింత ఇంట్రస్టింగ్ గా ఉంది. అలాగే యూట్యూబ్ తిరుగులేని స్టార్ గా ఉన్న షణ్ముఖ్ జశ్వంత్, హమీద, నటరాజ్ మాస్టర్, సరయు, విశ్వ, ఉమాదేవి, మానస్, ఆర్జే కాజల్, శ్వేతత పాటు చివరగా యాంకర్ రవి హౌస్‌లోకి అడుగుపెట్టారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.