
అలేరు, మన చౌరాస్తా : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామ సమీపంలోని రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పీఆర్వో ఆదిమూలం సురేష్ కుటుంబ సభ్యుల తో కలసి దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా సురేశ్ వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర వెంకటేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు క్యాసాగళ్ల చందు, ఆదిమూలం వీరస్వామి, దికొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.