
బచ్చనపేట, మన చౌరాస్తా : పొచ్చన్నపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిదే మల్లేషం తండ్రి పరిదే కొమురయ్య కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. వారి కుటుంబాన్ని జనగామ జిల్లా రైతు బందు సమితి మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, మాజీ సర్పంచులు కాసాని మహేందర్ రెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, నరేడ్ల బల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీలు, గూడా సిద్దారెడ్డి, మామిడాల లావణ్య ఐలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ కానుగంటి బాలచందర్, నాయకులు ఫిరోజ్, జూకంటి కిష్టయ్య, చింతపండు బాలకృష్ణ, గంధమల్ల నరేందర్, రాగి బుచ్చిరెడ్డి, తుప్పతి భాస్కర్, వల్లపురెడ్డి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పరామర్శించి అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.