జనగామ, మన చౌరాస్తా : జనగామ మండలం ఓబుల్కేశ్వాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బుర్ర శంకరయ్య గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె బుర్ర అపర్ణ పీహెచ్డీ పట్టా సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆమె సమర్పించిన ఫిజిక్స్ విభాగం పరిశోధన అంశంపై పీహెచ్డీ అవార్డును ఉస్మానియ విశ్వ విద్యాలయం ఎగ్జామినేషన్ అదనపు కంట్రోలర్ ప్రకటించారు. అపర్ణ గురువు ఉస్మానియ విశ్వ విద్యాలయం ఫిజిక్స్ ప్రొఫెసర్ డా. కలీం అహ్మద్ జలీలి మార్గదర్శనం లో ‘ఎలక్ట్రికల్ అండ్ మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఐఎంజీజీడీ అండ్ కె – జడ్ఎన్ -జీడీ నానో ఫెర్రిటీస్క’ అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించారు. సొంతూరులో పదో తరగతి వరకు చదివిన అపర్ణ జనగామ ఏబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఏకశిలా డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి నిజాం కళాశాల హైదారాబాద్లో ఎంఎస్సీ పూర్తి చేసింది.