
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన రజక దోబీ రిజర్వేషన్ సంఘ్
హైదరాబాద్, మన చౌరాస్తా : రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రజక దోబీ రిజర్వేషన్ సంఘ్కోరింది. ఈ మేరకు ఆదివారం కిషన్‌రెడ్డిని తన నివాసంలో దోబీ రిజర్వేషన్ సంఘ్ నేతలు కలిశారు. ఒకే కులవృత్తి చేస్తున్న దోబీలకు భిన్న రిజర్వేషన్లు ఉండడం వల్ల ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు తలెత్తుతున్నాయన్నారు. రజకులపై దాడులు, దూషణలు పెరుగుతున్నాయని, వీటి నిరోధానికి చట్టం తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నర్సింగరావు, కలకుంట బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.