
చేర్యాల, మన చౌరాస్తా : చేర్యాల పోలీస్ స్టేషన్లో ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఏ ఎస్ ఐ వి .నవీన్ కుమార్, దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్రోల్ల అన్నమ్మ నవజీవన్ తో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఏఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఏసుప్రభు చూపిన కరుణ, దయ మార్గము మానవాళికి ఆదర్శమన్నారు. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరి యాలని, ప్రతి ఒక్కరు తోటి వారికి సహాయము చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తమ మతాన్ని ఆరాధిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ఏఎస్ఐ నవీన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రోల్ల చరణ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




