CM KCR : నేనే సీఎం..
– క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే ఇంకా పదేళ్లైనా కొనసాగుతానని.. తన ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
ఈ రోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. పార్టీలో… ఎమ్మెల్యేల్యు.. మంత్రుల్లో మరి కొద్ది రోజుల్లోనే సీఎంగా కేటీఆర్ ను చేస్తారని ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వంలోనే ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ పడితే అక్కడ సమావేశాల్లో… ప్రెస్ మీట్లలో కేటీఆరే కాబోయే సీఎం.. అందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇంకోసారి ఇలాంటి ప్రచారాలు చేయవద్దంటూ వార్నింగ్ సైతం ఇవ్వడం విశేషం. ఇక మీదట ఏ నాయకుడు సీఎం మార్పు మీద మాట్లాడినా చర్యలు తప్పవని కూడా చెప్పారు. కేసీఆర్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కేటీఆర్ సీఎంగా కావడం ఇక కలగానే మిగలనుంది. ఇటీవల ప్రతిపక్షాల నుంచి ఈటల ను సీఎంగా చేయాలనే స్టేట్ మెంట్లు రావడం కూడా సీఎం కేటీఆర్ పేరును కొద్ది రోజులు పక్కకు జరుపుతున్నారా.. అనే సందేహాలు వస్తున్నాయి..
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)