CM KCR Meeting : సారు మనసులో మాట చెప్తడా..?
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు సీఎం కేసీఆర్ సారు పెట్టే మీటింగ్ మీదనే ఉంది. ఏమిటా మీటింగ్.. ఎందుకింత సడెన్ గా ఉన్నపలంగా రాష్ట్రంలో ఉన్న కీలక పోస్టల్లో ఉన్న వారికి ఏకాయేకి హైదరాబాద్ పిలిపించారనేది సందేహంగా మారింది. ఈ రోజు(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టేట్ లెవల్ కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షుడు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా చర్చించే అంశాలు పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే మిగిలిన స్టోరే ఎలా ఉండబోతున్నదనేది సస్పెన్ష్ గా మారింది.
సార్ ఏం చెప్తడో…?
రెండు గంటలకు మొదలయ్యే మీటింగ్ లో సారు ఏం చెబుతడో అనే సందేహం అందరికీ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో బీజేపీ చాప కింద నీరులా పాకుతూపోతుంది. దీన్ని రాష్ట్రంలో ఎలా ఎదుర్కోవాలనే అంశం మీద కార్యచరణ ప్రకటిస్తారా..? లేక కేంద్ర ప్రభుత్వంతో ఖయ్యం ఎందుకని ఢిల్లీ పోయివచ్చిన సారు.. కేంద్రం పథకాలు అన్ని మంచివే అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడం.. అప్పటిదాక రైతు చట్టాల మీద ధర్నాలు చేసి… చేయించిన సారు ఒక్కసారి యూటర్న్ తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ కూడా కొంత బలహీన పడుతుంది. ఏప్రిల్ జరగబోయే ప్లీనరీ కోసం పార్టీ బలోపేతం గురించి చర్చిస్తారా తెలవాల్సి ఉంది. వీటన్నంటి కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్ట్ గా మారిన సీఎం మార్పు అంశం ఈ రోజు చర్చకు వస్తుందా అనేది కీలకం కానుంది. రాష్ట్రంలో జిల్లా స్థాయి.. రాష్ట్ర స్థాయి ఛైర్మన్లకు కూడా పిలిచారంటే సారు మనసులో మాట చెబుతారనేది పార్టీ వర్గాల బోగట్టా. అందరి ముందు సీఎం మార్పు అంశం పెట్టి.. వారి నుంచి స్పందన… అంగీకారం తెలుపడానికే ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సర్వత్రా చర్చ. మరో రెండు మూడు గంటల్లో ఏదో విషయం అయితే తేలిపోనుంది.. వెయిట్ అండ్ సీ..
– అయుక్త, చౌరాస్తా
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)