- జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్
జనగామ, మన చౌరాస్తా : వచ్చే నెల 31లోగా సీఎంఆర్ బియ్యం లక్ష్యాలను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ ఆదేశించారు. గురువారం జిల్లాలోని రైస్ మిలర్ల అధ్యక్ష, కార్యదర్శులతో సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి తరలించే ప్రక్రియపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖరీఫ్, రబీ 2023–-24 సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని సకాలంలో ఎఫ్సీఐకి తరలించాలని సూచించారు. అలాగే బియ్యం అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసి, ఆగస్టు 31లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఎస్ఓ రోజారాణి, డీఎం ప్రసాద్, డీటీ పౌరసరఫరాల శాఖ ఈ. శ్రీనివాసు, జి.దేవా, మిల్లర్ల అధ్యక్షుడు పజ్జురి జయహరి, బెల్దీ వెంకన్న, చల్లా శ్రీనివాస్ రెడ్డి, ముత్తయ్య, దిలీప్ రెడ్డి పాల్గొన్నారు.