
కొమురవెల్లి, మన చౌరాస్తా : తపాస్ పల్లి రిజర్వాయర్ ను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అన్నారు. రిజర్వాయర్ పై ఉన్న మురికి తుమ్మలను, పిచ్చి చెట్లను తీసి వేయించాలని ఇరిగేషన్ అధికారులకు ఆమె సూచించారు. అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కొమురవెల్లి ఎస్ఐ రాజు, రెవెన్యూ సిబ్బంది, ఐనాపూర్ మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, మల్లం బాలయ్య, దండు నర్సింలు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.