
హైదరాబాద్, మన చౌరాస్తా : కడప జిల్లాలో డాక్టర్ ఎంవీ రమణారెడ్డి స్థాపించిన రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరులో 1987– -88 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చి వ్యాయామ విద్యను అభ్యసించి పూర్వ విద్యార్థులు 36 తర్వాత కలుసుకున్నారు. హైదరాబాద్లోని ఆరా క్రేసిట్ రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు 60 మంది విద్యార్థులు, 8 మంది వ్యాయామ ఉపాధ్యాయ గురువులు పాల్గొన్నారు. 36 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఎంతో ఆనందంగా గడిపారు. ఒకరిని ఒకరు ఆలింగణం చేసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఎంతో ఆప్యాయతతో గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గురువులకు ఘనంగా సత్కరించి ఙ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.పరమేశ్వర రావు, డాక్టర్ బి.రవిశంకర్ , డాక్టర్ ఎస్. గోపాల్ రెడ్డి, డాక్టర్ సయ్యద్ కరిముల్లా, డాక్టర్ ఎం.శివశంకర్ రెడ్డి, డాక్టర్, పి. కె.సుబ్రహ్మణ్యం, ఐ.ఆంజనేయులు, రేవతి పాల్గొన్నారు. ఈ మేరకు ఒక ఆర్గనైజ్ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ఆర్ జనార్దన్ రెడ్డి,కే.రామి రెడ్డి, వి. అరుణ భాస్కర్, బి.వి ఎస్.నరసింహారావు, రమణమూర్తి , అరుణారెడ్డి, బి సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.