- జనగామ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..
- ‘పల్లా’ను 100 మీటర్లల్లో బొందపెట్టాలి
- ‘పొన్నాల’ను బండకేసి కొట్టాలి
- జనగామ సభలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
‘జనగామ గడ్డ మీద దేవాదుల ఉప్పొంగి వరదలు అయ్యి ప్రవహిస్తే ఏ విధంగా ఉంటుందో అలా ఉంది ఈ సభా ప్రాంగణం. ఈ జన సందోహాన్ని చూస్తుంటే కాలనాగుల పని పట్టడానికి పుట్టలో నుంచి బయటకు వచ్చిన చీమల్లా కనిస్తున్నరు..’ అంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఉద్విగ్నంగా చేసిన ప్రసంగం జనగామ జనం గుండెలను తాకింది. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభా ప్రాంగణం ‘సీఎం సీఎం సీఎం..’ అనే దద్దరిల్లింది. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి చీఫ్ గెస్ట్ హాజరై బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శ బానాలు విరుసుతూ… జనగామ కాంగ్రెస్ అభ్యర్థిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
తెలంగాణ ప్రజల తీర్పు కోసం దేశం చూస్తుందని, ఇక్కడి ఫలితాలతో దేశంలో కాంగ్రెస్ సునామీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంత వాసి పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందన్నారు. అసలు టికెట్ ఇస్తమో లేదో తెలియకుండానే ఏం నొప్పి వచ్చిందని కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ను మోసం చేసిన పొన్నాల బీఆర్ఎస్లోకి వెళ్లాడని ప్రశ్నించారు. పొన్నాల లేకుంటే జనగామలో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా.. కానీ ‘పొన్నాల లాంటి వాళ్లను బండకేసి కొడుతాం..’ అని కార్యకర్తులు నిరూపించారని, ఇందుకు ఈ సభే నిదర్శనం అన్నారు. ఇక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరెడ్డి గురించి ఆయన సొంత కూతురే చెప్పింది. మా నాన్న కబ్జాకోరని, రాజీయాలకు దూరం చేసి శిక్షించాలని కోరిందని గుర్తు చేశారు.
‘పల్లా’పై రేవంత్‌రెడ్డి విసుర్లు..
‘ఎత్తు పళ్లు ఉన్నాడు ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటడు..’ జనగామ నుంచి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా నవ్వు కుంటనే ఉంటాడని రేవంత్‌రెడ్డి సెటేర్లు వేశారు. అందుకే కేసీఆర్ పళ్లు ఇకిలించే పల్లాను మీకు అభ్యర్థిగా పెట్టారన్నారు. పల్లాను 100 మీటర్లలో బొంద పెట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అసలు పల్లా ఎటువంటి వాడు అనేది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అర్థన్నగంగా నిలబడి చెప్పాడని గుర్తుచేశారు. పల్లా, ముత్తిరెడ్డి బాగోతాలు ఒకరికి.. ఒకరికి తెలుసు, వీరిద్దరి బాగోతం గడిలో ఉన్న దొరకు తెలుసుని విమర్శించారు. కేసీఆర్‌కు అభివృద్ధి చేసే లీడర్లు అవసరం లేదని, సారలో నీళ్లు, సోడా పొసే వాళ్లు కావాలని పల్లా గెలిస్తే చేసేది అదే పని అని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన ఉన్న కాంగ్రెస్ కావాలా, గడిలా పాలన కావాలా మీరే ఆలోచించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మందు, డబ్బులు, విందులను నమ్ముకుని ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రజలను మత్తులో ఉంచి గెలివాలి అనుకుంటున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలునిచ్చారు. 2004లో తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవి వదులుకున్న కొమ్మూరి కావాలా, ఆంధ్ర కీలుబొమ్మ పల్లా కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్న తీర్పు దేశంలో పెను తుఫాను రాబోతుందన్నారు.
పెద్దలు.. గద్దలు.. బిల్ల రంగలు
సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్న ఈ దశాబ్ద కాలంలో శతాబ్దానికి సరిపడా డబ్బులు దోచుకున్నడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వేల కోట్లు మింగారన్నారు. కేసీఆర్ ధన దాహానికి ఏమి సరిపోలేదన్నట్టు ప్రశ్న పత్రాలు కూడా అమ్ముకున్నాడని మండిపడ్డారు. గ్రూప్ పరీక్ష రద్దుతో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ప్రవళ్లిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీమానా చేయగానే వెంటనే బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ‘బిల్ల రంగలు’ ప్రవళ్లిక కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుకున్న పొన్నాల లక్ష్మయ్య గద్దలుగా మారి తమ కార్యకర్తల గుండెలపై తన్ని వెళ్లాడని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఆగుతుందని అంటున్న కేసీఆర్‌కు మతి ఉందా లేదా మందే మాట్లాడుతున్నాడా ప్రశ్నించారు. 2014లో ఇందిరమ్మ ఇళ్లు డబ్బా ఇల్లు అన్నా కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పాడని, ఎంత మంది ఇండ్లు ఇచ్చాడో చెప్పాలన్నారు.
‘భవన్’ను బంబులో పేల్చినా తప్పలేదు..
కేసీఆర్ సర్కారు వచ్చాక పేదలకు ఇండ్లు రాలేదు కానీ ఆయనకు మాత్రం వెయ్యి ఎకరాల పామ్ హోస్ మాత్రం వచ్చిందన్నారు. 150 రూమ్‌లతో గడీల ప్రగతి భవన్ ఏర్పాటు చేసుకుంటడని విమర్శించారు. ప్రగతి భవన్లో తలుపులు ఆంధ్ర కాంట్రాక్టరులకు తీసి ఉంటాయి.. కానీ, ప్రజలకు ప్రవేశం లేదన్నారు. అలాంటి భవన్ ఉంటే ఏంటీ.. బాంబులతో పేలితే ఏంటీ అంటు ఘాటుగా విమర్శించారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)