
జనగామ, మన చౌరాస్తా : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోట్ల నర్సింగరావు అన్నారు. ధర్మకంచకు చెందిన 13వ వార్డు ఎస్సీ సెల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కందుల రవి హటాత్తుగా మరణించగా ఆయన కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. రవి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. వారి వెంట 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిద్దెపాక స్టాలిన్, సీనియర్ నాయకులు వంగపల్లి శ్యామ్, తోట సునీల్, గొంగళ్ల రామకృష్ణ, దేవులపల్లి సుదర్శన్, నాగిళ్ల రాజు, తిప్పార ఉప్పలయ్య, ఇల్లెందుల బిక్షపతి, తిప్పారపు రాంచందర్, గొర్రె ఉమేష్, తోట జాన్, మళ్లిగారి రాకేష్, గడ్డం రాజు, సోమరపు శ్రావణ్, నాగిళ్ళ శ్రీను, చింతల సాయి, ఎర్ర పరమేష్, బొంకూరి రాకేష్, గొంగళ్ల బన్నీ, నాగిళ్ల సాయి, నమిలె కృష్ణ, బొల్లపెల్లి సాయి, జాలియం శివ తదితరులు పాల్గొన్నారు.