
Oplus_16777216
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్
జనగామ, మన చౌరాస్తా: మోడీ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ అన్నారు. జనగామ పట్టణంలో సోమవరం నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీ పట్టణ అధ్యక్షుడు జోగు ప్రకాష్ అధ్యక్ష వహించగా ముఖ్య అతిథిగా ప్రసాద్ పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం 11సంవత్సరాలు మోడీ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూత్వ కార్పొరేట్ శక్తుల పాలనకు దానిని వ్యతిరేకిస్తున్న లౌకిక ప్రజాస్వామిక శక్తులకు మధ్య ఘర్షణ పెరిగాయన్నారు. ప్రధాన ధోరణిగా ఉంది హిందుత్వ ఎజెండాను ముందుకు పెట్టడానికి ప్రతిపక్షాన్ని ప్రజాస్వామ్యాన్ని అనుగదొక్కడానికి అనుసరిస్తున్న నియంతృత్వ పద్ధతులు నయా ఆశిస్తూ స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతత్వం కార్పొరేట్ విధానాలను సిపిఎం ఇతర వాపక్ష పార్టీలు దృఢంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కార్మికులు రైతాంగం ఇతర తరగతులకు చెందిన కష్టజీవులు తమ జీవనోపాధిని ఆర్థిక హక్కులను పరిరక్షించు కోవడానికి ఐక్య పోరాటాలు నడిపారని, దీనివల్ల బిజెపి పార్లమెంటులో సీట్లు తగ్గాయని అన్నారు. ప్రజలను మతం పేరుతో కులం పేరుతో కొట్లాటలు పెడుతూ నిరుద్యోగం మాట్లాడకుండా యువతను పెడదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల యువత తల్లిదండ్రులను పిల్లలను పట్టించుకోకుండా రోడ్ల పొంటి తిరుగుతూ ఉన్నారని, నిరుద్యోగం పెరిగి ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందిందని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకపోతే యువతను ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సుంచు విజేందర్, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, పల్లెల లలిత, బొట్ల శ్రావణ్, బూడిది ప్రశాంత్, పగిడిపల్లి బాలమణి, గౌసియా, జయ, రజిత అబ్రహం లింకన్, తిమోతి, వెంకటేష్, మాదా సుధాకర్, ఉపేందర్, వెంకటేష్, జయ, రజిత, అండాలు, కమల, అంజమ్మ, లక్ష్మమ్మ, సుగుణ, రేణుక, పద్మ, అండాలు, చింతల శ్రీలత, సమ్మక్క, రజియా, యాదలక్ష్మి, స్వప్న, మానవ, పావని, విజయ, శిరీష, అరుణ తదితరులు పాల్గొన్నారు.