- కంచె రాములు చరిత్ర జనగామ ప్రజలకు తెలుసు
- అసమ్మతి నేతలపై కొమ్మూరి వర్గం ఫైర్
- పద్ధతి మార్చుకోవాలని హితవు
జనగామ, మన చౌరాస్తా : బీఆర్ఎస్కు అమ్ముడు పోయిన కొందరు నేతలు తమ పార్టీ పరువును తీస్తున్నారని కాంగ్రెస్ అసమ్మతి నేతలపై కొమ్మూరి వర్గీయులు ఫైర్ అయ్యారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికి ఇందిరా, కాంగ్రెస్ నేతలు మేడ శ్రీనివాస్, కామిడి జీవన్ రెడ్డి మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఇది సరికాదన్నారు. మీ చరిత్ర జనగామ ప్రజలకు తెలియంది కాదని విమర్శించారు. కంచె రాములు ఓ రౌడీషీటర్ అని, ఆయనపై ఉన్న కేసుల చిట్టా బయట పెడితే ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ఘాటుగా విమర్శించారు. కంచె రాములు గతంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది నిజం కాదా ప్రశ్నించారు. అలాంటి పార్టీ పరువును తీసున్నాడని మండిపడ్డారు. అనేక దోపిడీలు, దొమ్మీలు, హత్య కేసులు ఉన్న రాములును గత బీఆర్ఎస్ ప్రభుత్వం జనగామ రాకుండా నగర బహిష్కరణ చేసిందని గుర్తు చేశారు. ప్యాక్షన్ చరిత్ర కలిగి ఉన్న రాములు కాంగ్రెస్ నాయకులను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా తీరుమార్చుకుని మసులుకోవాలని లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కార్యక్రమంలో జనగామ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, జనగామ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కళ్యాణి, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నరసింహారెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి కావ్య శ్రీ రెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జక్కుల అనిత వేణుమాధవ్, బొట్ల శ్రీనివాస్, మంత్రి సుమలత శ్రీశైలం, వివిధ మండలాల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.