పాలకుర్తి, మన చౌరాస్తా : శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం జనగామ జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి శేషవస్తాలతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.