చేర్యాల, మన చౌరాస్తా : మండల కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ,నాగపురి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బోకూరి బాల్‌రెడ్డి పెన్నులు పెన్సిళ్లను బుధవారం వితరణ చేశారు. అదేవిధంగా విద్యార్థుల వ్యక్తిగత ఫోటోలతో ఉన్న క్యాలెండర్లను సొంత ఖర్చులతో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు బాల్‌రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దొంగల అయిల్ రెడ్డి, ఈగ ఆంజనేయులు, కర్రోళ్ల విజయ్ కుమార్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.