
- రవళి నర్సింహోంలో అరుదైన శాస్త్ర చికిత్స
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణంలోని రవళి నర్సింగ్ హోమ్‌లో ఆదివారం ఉదయం రఘునాథపల్లి మండలానికి చెందిన ఓ యువతికి అరుదైన శాస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకరాగా కడుపునొప్పిని పరీక్షించిన డాక్టర్ రాజమౌళి పలు రకాలైన పరీక్షలు నిర్వహించగా కడుపులో పెద్ద కణితి ఉన్నదని గుర్తించారు.
రేడియాలజిస్ట్, అనస్థీషియా డాక్టర్ల సమక్షంలో యువతికి శాస్త్ర చికిత్స చేసి కడుపులో నుంచి సుమారు 9 కిలోల కణితిని డాక్టర్ రాజమౌళి తొలగించారు. యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 9 కిలోల కణితిని తొలగించిన డాక్టర్ రాజమౌళిని రోగి బంధువులు, ఇతరులు అభినందించారు. ప్రజా వైద్యుడిగా ఎంతో పేరున్న డాక్టర్ రాజమౌళి ఇప్పటికే ఇలాంటివి పలుమార్లు అరుదైన శాస్త్ర చికిత్సలు చేసి రికార్డు నెలకొల్పారు. ఇప్పటికే ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడిన డాక్టర్ శాస్త్ర చికిత్సను పలువురు కొనియాడుతున్నారు. ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ రాజమౌళి, వైద్య బృందం, ఆసుపత్రికి సిబ్బంది అలిసేరి శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.