drug racket : డ్రగ్ రాకెట్లో ఎమ్మెల్యేలు!
డ్రగ్స్ కేసులో (drug racket) కర్ణాటకలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదులుతోంది. బెంగళూర్‌లో వెలుగు చూసిన డ్రగ్ రాకెట్ విచారణలో సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమకారుడిగా చెప్పుకునే ఓ పెద్ద మనిషి కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రముఖ నటులను బెంగళూరు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు లింకులు హైదరాబాద్‌లో ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఆ ముగ్గురిలో ఒకరిని అరెస్టు చేసేందుకు బెంగళూరు పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై మరింత స్పష్టత వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. మొత్తానికి బెంగళూరు డ్రగ్ కేసు నేడో, రేపో రాష్ట్రంలో సంచనం రేపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తిని కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. సినిమాలకు ఫైనాన్స్, క్యాబ్స్ బిజినెస్ చేసే ఈయన సినిమా వాళ్లతో ఏర్పడిన పరిచయాలు డ్రగ్స్ మార్కెట్లోకి వెళ్లేలా చేశాయని ప్రచారం సాగుతోంది. ఇక హైదరాబాద్‌లో గతంలో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును ఇక్కడి పోలీసులు కోల్డ్ స్టోరేజ్‌లో పడేశారు. కానీ, బెంగళూరు ఆఫీసర్లు మాత్రం డ్రగ్స్ రాకెట్ తీగను మొత్తం లాగేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..