లింగాలఘణపురం, మన చౌరాస్తా : అక్టోబర్ 12న జరుగునున్న విజయ దశమి (దసరా) వేడుకల కోసం లింగాలఘణపురం మండలం నెల్లుట్లలో ఆదివారం ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించే ఈ వేడుకలకు అన్నివర్గాల కుల పెద్దలు సమావేశమై ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా చిట్ల ఉపేందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ బర్ల అబ్బసాయిలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కురుమ సంఘం గౌరవ అధ్యక్షుడు కడకంచి ఆంజనేయులు, కురుమ సంఘం అధ్యక్షుడు గొరిగే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.