eenadu : పెబ్బేరు దెబ్బ
ఒక్కోసారి బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారుతాయంటే ఇదినేమో.. అగ్రిమెంట్లు, రూల్స్ పేరుతో సిబ్బందిని ఇబ్బంది పెట్టే ‘ఈనాడు’కు ఓ గ్రామీణ విలేకరి ఊహించని షాక్ ఇచ్చాడు. 30 ఏళ్ల పాటు నిబద్ధతతో పని చేసిన తనను అవమానించారని, తన పరువు తీశారని ఏకంగా కోర్టుకు వెళ్లాడు ఆయన…
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బి.రమేశ్.. 30 సంవత్సరాలు ఈనాడులో (eenadu ) విలేకరిగా పనిచేస్తున్నాడు. ఎంతో నిబద్ధత తో పనిచేస్తూ వచ్చిన ఆయనను యాజమాన్యం అవమానకారంగా రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తప్పించింది. దీంతో తీవ్ర మనోవేదన గురైన రమేశ్ సమాజంలో తన పరువు పోయిందని ఆరోపిస్తూ వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించాడు. పరువు నష్టం కింద ‘ఈనాడు యాజమాన్యం’ తనకు రూ.20 లక్షలు చెల్లించాలని కోరారు. ఈ పిటీషన్‌ను స్వీకరించిన వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి ఈనాడు సంస్థలకు చెందిన చీఫ్ ఎడిటర్, ఉషోదయ మేనేజింగ్ డైరెక్టర్, న్యూస్ టుడే మేనేజింగ్ డైరెక్టర్లకు ఏప్రిల్ 20 న వనపర్తి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.
రమేశ్ వనపర్తి జిల్లా పెబ్బేరు రిపోర్టర్‌గా దాదాపు 30 ఏళ్లుగా ఈనాడులో పనిచేస్తున్నట్లు కోర్టుకు చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఇచ్చే ఉత్తమ జర్నలిస్టు అవార్డును మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ స్వేతా మహంతి చేత మీదుగా అందుకున్నానని కోర్టు దృష్టికి తెచ్చారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 2020 సెప్టెంబర్ నెలలో ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నారు. చెప్పాపెట్టకుండా ఉద్యోగం నుంచి తొలగించటంతో తన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొందని , ఇందుకు కారణమైన ఈనాడు యాజమాన్యం తనకు పరిహారం చెల్లించాలని కోరారు. వనపర్తికి చెందిన సీనియర్ న్యాయవాది బక్షి చంద్రశేఖర్ రావు రమేశ్ తరుఫున కేసు ఫైల్ చేశారు. దీంతో ఓ ఎస్ నంబర్ 74 /2021 పై వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి ఈనాడుకు సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 20న వనపర్తి కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..