ఓ మల్లన్న.. ఏమైంది.. సల్లబతా అని పోయి వారం అయ్యింది. ఎటుపోయినవే..! అస్సలు కనిపియ్యకపోతివి.
ఏ పోవే.. ఎల్లన్న పోయిన వారం నుంచి ఏమైనా మంచి గున్నదానే.. కాలం మారిపాయే.. ఎండలు పోయి వానలు మొదలాయే.. ఐదు, ఆరు రోజుల నుంచి ఒకటే ముసురాయే.. ఇక బయటకు ఎట్టా రావాలే..!
మల్లన్న : సరే కానీ.. నీతో మాటా ముచ్చట పెడితేనే మన రాజకీయం గురించి తెలుస్తదే..! అందుకే నీ కోసం చూస్తున్న.
ఎల్లన్న : ఓర్నీ అందుకేనా నన్ను కలవరిత్తాన్నావ్..! నిన్న పొద్దుగాల పోషిగాడు వచ్చి మల్లన్న కలవరిత్తాండు అంటే.. నాపై పేమ అనుకున్నా.. ఇదా సంగతి..!
మల్లన్న : అమ్మనా.. పోషిగాడు.. నీకు ముచ్చట అంతా చెప్పిండానే..!
ఎల్లన్న : హా..హా… ఏం చెప్పలేగానీ.. నీ ముచ్చట చెప్పు.
మల్లన్న : ఏం చెప్పాలన్నే.. మొన్న జనగామ రాజకీయం చెబితివి.. గిప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యే, మన మంత్రి దయన్న (ఎర్లబెల్లి దయాకర్‌రావు) ముచ్చట అడుగుదాం అనుకున్న.
ఎల్లన్న : దయ్యన్నకు ఏమైంది. మంచిగనే ఉన్నడు కదా..!
మల్లన్న : ఓర్నీ నీకు తెల్వదానే..! దయన్నకు పాలకుర్తిలో దడ మొలైందంట కదా..!
ఎల్లన్న : దయన్నకు దడా..!
మల్లన్న : అవునే ఇంతకాలం మన పాత వరంగల్ జిల్లాలో ఓటమి ఎరుగని నేత, ఎప్పుడూ పాలకుర్తిలో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే లీడర్‌గా పేరన్న దయన్నకు కాంగీరేస్ వాళ్ల మంచి క్యాండిడేట్‌ను తెచ్చిన్రు.
ఎల్లన్న : ఎవరే.. ఆ నాయకుడు..?
మల్లన్న : ఓర్నీ నీకు తెల్వదానే.. నాయకుడు కాదు.. నాయకురాలు.. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. గీమె ఎన్ఆర్ఐ. వీళ్ల కుటుంబం ఆమెరికా ఉంటూనే పేదల కోసం మస్తు సేవ చేసిందట. మన ఎంజీఎంకు కూడా అప్పట్లనే కోటి రూపాయల విరాళం ఇచ్చిన్రట. ఊళ్ల కూడా అడిగినోళ్లకు మస్త సాయం చేసిందట.
ఎల్లన్న : ఓ అట్లనా..! నాకు తెల్వదే..
మల్లన్న : ఆమెను కాంగీరేస్ వాళ్లు పట్టిన్రు. దీంతో దయన్నకు దడ మొదలైంది.
ఎల్లన్న : ఏ ఓకో మల్లన్న.. దయాకర్‌రావు సారు 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీ గెలిచిండు. ఇప్పడు మంత్రిగా ఉన్నడు. ఓటమి ఎరుగని నేతగా పేరుంది.
మల్లన్న : అవును నువ్వన్నది నిజమేనే..! ఓటమి ఎరుగని నేతగా ఆయనకు వచ్చిన పలుకుబడే.. ఆయన్ను ఆగం చేస్తుంది. ఆయన కంచుకోటగా భావిస్తున్న పాలకుర్తికి బిటలు వారిస్తోంది.
ఎల్లన్న : అదేంటి అట్టా అంటవ్..!
మల్లన్న : అవును ఇది నిజం. దయన్న మంత్రిగా అయిన నాటి నుంచి ఆయన తీరు మారిందని సొంత పార్టీ వాళ్ల అంటున్నారు. వాళ్ల అస్మతిగా తయారై గుట్టుచప్పుడు కాకుండా మీటింగ్‌లు నిర్వహిస్తున్న దయన్న సీటుకు ఎసరు పెడుతున్నారు.
ఎల్లన్న : అయ్యో.. పాపం దయన్న..! ఆయనకు ఇంత పెద్ద కట్టం వచ్చిందానే..
మల్లన్న : మొన్న సారు ఫారిన్ పోయివచ్చే సరికి పాలకుర్తిల కిందమీదైంది అని అంతా అనుకుంటున్నరు. నియోజకవర్గంలోని రెడ్డోళ్లు అంతా ఒక్కటైనరట. ఈసారి సారు కాకుండా ఝాన్సీరెడ్డికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నరట.
ఎల్లన్న : అంతేనా..!
మల్లన్న : అంతేనా అని చిన్నగ అంటున్నవ్ ఏందే. బీఆర్ఎస్ లీడర్ల కూడా దయన్నను ఇడిసి పోనీకే చూస్తున్నరట.
ఎల్లన్న : ఓర్నీ గాళ్లకు ఏమైంది. మంచిగనే ఉన్నరు కదా..!
మల్లన్న : దయన్న టీడీపీ నుంచి టీఆర్ఎస్లకు వచ్చినంక ఆయనతోటి వచ్చిన తెలుగుదేశం తమ్ముళ్లను చూసుకున్నంత ఉద్యమ లీడర్లను చూసుకుంట లేడంట. అందుకే వాళ్లు జంప్ అయ్యేందుకు చూస్తున్నరట.
ఎల్లన్న : గా పోయేటోళ్ల పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్‌రావు ఉండొచ్చు.
మల్లన్న : అబ్బ ఏం చెప్పినవే.
ఎల్లన్న : గది చెప్పడు ఏంది. సుధాకర్‌రావు సార్ చానా ఏళ్ల నుంచి పార్టీల పనిచేస్తుండు. ఆయనకు ఎమ్మెల్సీ ఇత్తమని మోసం చేసిన్రు అని గుర్రు మీద ఉన్నడు కదా..!
మల్లన్న : అది నిజమే కదా..!
ఎల్లన్న : ఇటు సుధాకర్‌రావు సారుతో పాత లీడర్లు పోతే, ఇటు రెడ్డోళ్లు సపోర్ట్ ఇయ్యకుంటే పాపం దయన్నకు ఈసారి కట్టమే మరి..!
మల్లన్న : ఆ.. అందుకే దయన్న కూడా పాలకుర్తిని ఇడిసి పెట్టి పక్కకు పోయేందుకు చూస్తుండంట.
ఎల్లన్న : ఏందీ.. దయన్న పాలకుర్తిని ఇడుస్తాడా..?
మల్లన్న : అవును మరి.. గదే అసలు ముచ్చట.
ఎల్లన్న : పాలకుర్తిని ఇడిసి యాడికి పోతడే..?
మల్లన్న : జనగామకో.. వరంగల్ తూర్పుకో పోతడని ప్రచారం అయితాంది.
ఎల్లన్న : గట్లయితే.. జనగామలో ముత్తిరెడ్డి, పోచంపల్లి, దయాకర్‌రావులతో ఈసారి సక్కగనే ఉంటది సంబడం..! ఏమోపో ఎవరు ఎటుపోతే ఏందీ గాని అగో మళ్లీ మురుసు అందుకునేట్టు ఉంది. ఇంటికి పోతా.. మల్లన్న..!!
మల్లన్న : సరేనే ఎల్లన్న.. ఇగ పో..!!
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన