పాలకుర్తి , మన చౌరాస్తా : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆదివారం పాలకుర్తి ఉన్నత పాఠశాలలో ‘పునరుత్పాదక శక్తి వనరు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మండలంలోని పలు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులు పాల్గొని రాశారు. ఎంపీడీవో ఆవుల రాములు, మండల విద్యాధికారి నర్సయ్య, మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంటా రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఎమ్మార్సీ సిబ్బంది సరేష్, కిషన్, రమేష్ ఉపాధ్యాయులు ఆరీఫ్, వేణు పాల్గొన్నారు. మొదటి బహుమతి షీలా వైష్ణవి (జడ్.పి.హెచ్.ఎస్ వావిలాల), రెండో బహుమతి ధీరావత్ రీతుశ్రీ (కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్), మూడో బహుమతి ఎం.రుచిత (సోషల్ వెల్ఫేర్ స్కూల్ పాలకుర్తి), నాల్గో బహుమతి M.వైష్ణవి (జడ్పీహెచ్ఎస్ ,ఈరవెన్ను) గెలుచుకున్నారు. అలాగే పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేట్ సర్టిఫికెట్లు, డిక్షనరీలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు.