- అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
భూపాలపల్లి, చౌరాస్తా : భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకింది. కుటుంబంలోని వృద్ధురాలికి ముందు పాజిటివ్ వచ్చింది. ఇంట్లో ఉన్న మిగతా నలుగురికి కూడా టెస్టులు చేయించగా వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారులు వారిని ఇంట్లోనే ఐసోలేట్ వైద్యం అందిస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.