
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణంలోని బాలాజీ నగర్ 3వ వార్డులో బాలాజీ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.