Gangavva : అవ్వా.. నువ్వు గ్రేట్..
గంగవ్వ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. మై విలేజ్ షోతో యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఆమెకు ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తొలుత కూలీ పనులు చేసుకుంటూ ఊరు దాటని గంగవ్వకు అక్షరం ముక్కరాదు. కానీ, సోషల్ మీడియాలో ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ పల్లె సంస్కృతికి జీవం పోసే ఆమె మాటతీరే.. గంగవ్వను బిగ్ బాస్ సిజన్–4 వరకు తీసుకెళ్లింది. నాలుగు వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఆమె ఆ తర్వాత ఐదో వారం స్వచ్ఛందంగా బయటకు వచ్చింది. నాలుగు సీజన్లలో తనంతట తానే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఏకైన కంటెస్ట్ గంగవ్వే.. (gangavva) ఆ తర్వాత ఆమె ఎప్పటిలాగే తన యూట్యూబ్ వీడియోల్లో బిజీ అయిపోయింది. కొన్ని రోజుల క్రితం తన ఇంటి నిర్మాణం వీడియోను అభిమానులతో పంచుకున్న గంగవ్వ.. తాజా గాలిమోటర్ ఎక్కి చక్కర్లు కొడుతున్న వీడియోను విడుదల చేసింది. ఈ విడియో చూసిన నెటిజన్లు అవ్వా.. నువ్వు గ్రేట్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)