
జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లాలోని అత్రి మహర్షి గురుకుల విద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏనుగు నర్సిరెడ్డి, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.