
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మల్లిగారి రాజు 94వ సారి రక్తదానం చేశారు. ఈ నెల 14వ తేదీని పురస్కరించుకుని ఆదివారం జీజీహెచ్ లో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ ఆధ్యర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జనగామ సీఐ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా మల్లిగారి రాజు, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్ కుమార్, ఎమ్మార్పీఎస్ దండోరా కళామండలి జిల్లా అధ్యక్షుడు గజావెల్లి ప్రతాప్ తో పాటు పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జనగామ బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి డాక్టర్ కరుణాకర్ రాజు, జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్ పర్సన్ దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్, హాస్పిటల్ సిబ్బంది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.