
జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లా కేంద్రంలోని హైదారాబాద్ రోడ్లో ఉన్న సెయింట్ మేరీస్ పాఠశాలలో కేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు తుమ్మ రమేశ్‌రెడ్డి, శ్రీలతరెడ్డి, ప్రిన్సిపాల్ జైమోన్ థామస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రొఫెసర్ డాక్టర్ కట్ల రాజేందర్ ప్రొఫెసర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులు పైచదువులు చదివి ఎదగడానికి ఈ గ్రాడ్యుయేషన్ ఒక మైలురాయి అన్నారు. చిన్నప్పటి నుంచి చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకొని చదవాలన్నారు. జీవితంలో ఎదగాలంటే సంకల్పంతోపాటు సాధన అవసరమని మనం అబ్దుల్ కలాం, గాంధీజీ, అంబేద్కర్ లాంటి గొప్పవారి పుస్తకాలను చదవాలని సూచించారు.
డైరెక్టర్లు రమేష్ రెడ్డి, శ్రీలతారెడ్డి మాట్లాడుతూ చిన్నారులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో పుష్ప నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పీఆర్వో రంగరాజు ప్రసాద్, విజయ్ పాల్ రెడ్డి, రాజిరెడ్డి, ప్రమీల, ప్రవీణ, నర్మద, శైలజ, షాలిం, సంపత్, మైకేల్, శ్రీధర్, గుణవర్ధన్, రాజు, నరసింహా, రాజశేఖర్, హేమలత, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.