- కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ, మన చౌరాస్తా : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారునికి సరైన సమాచారం ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే అనంతరం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రీవెన్స్ కు వచ్చే దరఖాస్తుదారులకు మండల స్థాయిలోనే అధికారులు సరైన సమాచారం ఇవ్వాలని, సమస్య పరిష్కారం కోసం సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అన్ని తీసుకొచ్చే విధంగా అవగాహన పరచాలన్నారు. కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యం తగదని హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. 90 శాతం దరఖాస్తులు భూ సంబంధిత సమస్యలపైనే వస్తున్నట్లు తెలియజేశారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో వెంకన్న, జడ్పీ సీఈవో అనిల్ కుమార్ డీఆర్డీఏ పీడీ మొగులప్ప, జిల్లా అధికారులు పాల్గొన్నారు.