
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణంలోని 14వ వార్డు అంబేద్కర్ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. జనగామ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ భక్త బృందం ప్రతినిధులు పజ్జూరి శారద, మాదారపు కల్పన, పూజారి మహేశ్వరం శివశంకర్, దేవాలయ కమిటీ సభ్యులు కేశోజు మాధవ్ కుమార్, తూముగంటి రమేశ్, శ్రీరాముల మల్లేశం, వలబోజు సురేందర్, మారోజు నాగరాజు, నల్ల ఆంజనేయులు, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.





