- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆగిన పనులు
- ఇబ్బంది పడుతున్న తండావాసులు
జఫర్గఢ్, (చౌరాస్తా న్యూస్) : జనగామ జిల్లా తీగారం నుంచి హనుమాన్ తండాకు వెళ్లే రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడు నెల కింద ఈ రోడ్డు కోసం కంకర పోసి వదిలేయడంతో ఆ రూట్ వెళ్లే ప్రయాణికులు నరకం చేస్తున్నారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి యాకన్న రాథోడ్ ఆధ్వర్యంలో రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి రోడ్డు పనులను పూర్తి చేయలేక పోవడంతో తండా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న సదురు కాంట్రాక్టర్ పైన అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు చొరవ చూసి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. లేకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆయన వెంట మలోత్ గణేష్, అజయ్ ఉన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)