
- ఎడ్యుకేషన్, సోషల్ సర్వీస్ కేటగిరిలో గుర్తింపు
జనగామ, మన చౌరాస్తా : స్వచ్ఛంద సేవ సంస్థల్లో సభ్యత్వాన్ని కలిగి వాటి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసిన జనగామకు చెందిన జైన రమేష్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. ఆయన సేవలను గుర్తించి గుడ్ న్యూస్, డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ న్యూయార్క్ టెక్సాస్ (usa) అనుబంధ సంస్థ గాడ్ సన్ హోలీ తియలాజికల్ యూనివర్సిటీ వారు ఎడ్యుకేషన్, సోషల్ సర్వీస్ కేటగిరిలో రమేశ్‌ను గౌరవ డాక్టరేట్ ను ఎంపిక చేశారు.
పలు సేవా కార్యక్రమాలు..
ఆర్య వైశ్య మహాసభ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా విపత్తులో రమేష్ తన సొంత డబ్బులు రూ.3 లక్షలతో ఎంతో మందికి నిత్యవసర సరుకులను అందించారు. సుమారు 50 ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు క్రీడా సామాగ్రిని, బీరువాలు, కుర్చీలు, ఫ్యాన్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. లయన్స్ క్లబ్ సభ్యడిగా వివిధ ప్రాంతాలలో ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, లివర్ పరీక్షలు, బోన్ పరీక్షలు, గుండె పరీక్షలు పలు రకాలైన ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ఉచిత సేవలందించారు. ఆధ్యాత్మికంగా పలు ఆలయాలకు తనవంతు బాధ్యతగా విరాళాలు అందించి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. పేద ఆర్య వైశ్య కాలేజీ విద్యార్థులకు అవసరమగు వారికి సహకారం అందించి సాయం చేశారు.
అదేవిధంగా గత సంవత్సరం(2023-–24) లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్‌గా తనవంతు బాధ్యతగా జనగామలోని ఉన్న మాతా శిశు సంక్షేమ కేంద్రం ఛంపక్ హిల్స్ వద్ద తన బంధువులు, మిత్రులు, ఆర్య వైశ్యలు లయన్స్ సభ్యులు అందరి సహాయ సహకారాలతో నిరంతరాయంగా 365 రోజులు సుమారు రోజు 300 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు.
ఇలాంటి ఆయన సేవలను గుర్తించి ప్రముఖ గుడ్ న్యూస్, డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ న్యూయార్క్ టెక్సాస్ (usa) అనుబంధ సంస్థ గాడ్ సన్ హోలీ తియలాజికల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, సోషల్ సర్వీస్ కేటగిరిలో రమేష్‌ను గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసారు. ఆగస్టు8న రమేష్ ఈ అవార్డును అందుకోనున్నారు. రమేష్‌కు గౌరవ డాక్టరేట్ రావడంతో ఆయన కుటుంబ సభ్యలు, బంధుమిత్రులతో పలువరు రాజకీయ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.