
- జనగామ ప్లాట్లు కోల్పోతున్న బాధితుల సంఘం
మన చౌరాస్తా, జనగామ : జనగామ నుంచి దుద్దెడకు వెళ్తున్న జాతీయ రహదారిలో ప్లాట్లు కోల్పోతున్న బాధితుల రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బాధితుల సంఘం తరుపున దోర్నాల శ్రీనివాస్ శుక్రవారం నాటి దీక్షకు ప్రారంభించి మాట్లాడారు. బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే జనగామ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నల్ల యాదగిరి, పరమేశ్వరీ, మహేందర్, సిద్దిలింగం, జగన్మోహన్, ఎస్.కె అమీన్షా, ఉప్పరి విజయ్, ఏనుగుల సునీత వీరయ్య, ఆగస్టీన్ రెడ్డి పాల్గొన్నారు.




