స్టేషన్‌ఘన్‌పూర్, చౌరాస్తా : రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇంచార్జి సింగపురం ఇందిర బుధవారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజ్ మంజూరుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తారని హామీ ఇచ్చినట్లు ఇందిర తెలిపారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)