- మాజీ ఎమ్మెల్యే ఓ చెల్లని నాణెం
- కాంగ్రెస్ లోకి వస్తే అడ్డుకుంటాం
- లింగాల జగదీష్ చందర్ రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్, (చౌరాస్తా న్యూస్) : స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక చెల్లని నాణెమని, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర ఆదేశాల మేరకు శనివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది అధికార బీఆర్ఎస్లో చేరిన తాటికొండ రాజయ్య ఇప్పడు మళ్లీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి గెలుపునకు కృషి చేసి పార్టీ ఓడగానే కాంగ్రెస్ లో చేరుతామనడం సిగ్గుచేటు అన్నారు. దళిత బంధు, బీసీ బంధు ఇప్పిస్తానని లబ్ధిదారుల వద్ద వసూలు చేసిన డబ్బులు చెల్లించలేక తప్పించుకునేందుకు అధికార పార్టీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీల వైపు చూడడం ఆయన నైజమన్నారు. రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని తెలిపారు. రెక్కాడితే డొక్కాడని దళితుల వద్ద దళిత బంధుకై వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు . సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరబోయిన శ్రీరాములు, మంచాల ఎల్లయ్య, పట్టణ అధ్యక్షుడు నీల శ్రీధర్, తాటికొండ జాతర చైర్మన్ కోరుకొప్పుల మహేందర్, మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి, సింగపురం వెంకటయ్య, సింగపురం నాగయ్య, కత్తి సంపత్, కాసాని బొందయ్య, మర్రి రమేష్, మహిళా అధ్యక్షురాలు జోష్ణ, పద్మ, జ్యోతి, గాదె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)