
బాల్దె మల్లేశం(అధ్యక్షుడు), జూకంటి శ్రీశైలం (కార్యదర్శి), కేమిడి ఉపేందర్ (కోశాధికారి)
- అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా బాల్దె మల్లేశం
- కార్యదర్శిగా జూకంటి శ్రీశైలం
- కోశాధికారిగా కేమిడి ఉపేందర్
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణంలోని శ్రీబీరప్ప స్వామి దేవాలయంలో జనగామ కురుమ సంఘం గౌరవ అధ్యక్షుడు మోటే లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేవెల్లి సంపత్, జిల్లా అధ్యక్షుడు కంచె రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనగామ పట్టణ అధ్యక్షుడిగా బాల్దె మల్లేశం, కార్యదర్శిగా జూకంటి శ్రీశైలం, కోశాధికారిగా కేమిడి ఉపేందర్‌ను ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడు బాల్దె మల్లేశం మాట్లాడుతూ రెండు సంవత్సరాలలో శ్రీబీరప్ప స్వామి దేవాలయం నిర్మాణం పూర్తి చేసి, బీరప్ప స్వామి పండగ ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెద్ద కురుమలు మోటే పర్వతాలు, మోటే శ్రీశైలం, మోట శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జాయ మల్లేశం, కోపా గౌరవాధ్యక్షుడు కర్రె కృష్ణ, కోపా అధ్యక్షులు కడకంచి మధుసూదన్ కోపా కార్యదర్శి మంత్రి శ్రీశైలం, కోపా కోశాధికారి ఎండ్రు వైకుంఠం, మాజీ కౌన్సిలర్ కర్రె శ్రీను, బాల్డె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.