janareddy : అయ్యో.. జానా!
కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన కుందూరు జానారెడ్డికి (janareddy ) గుంట భూమి లేదంట..! అంతే కాదండి సారుకు సొంత కారు, సొంత ఇల్లు కూడా లేదంట..! ఇది ఏవరో చెప్పిన విషయం కాదు.. సాక్షాత్తు జానారెడ్డే ఎన్నికల అఫిడెవిట్లో పేర్కొన్నారు. నాగార్జనసాగర్ బైపోల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జానారెడ్డి తన చర, స్థిరాస్తుల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందజేశారు. జానా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలనలో ఎక్కువ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా జానా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత 2018 జనరల్ ఎలక్షన్లో నోముల నర్సింహ్మయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే నోముల అకాల మరణంతో సాగర్లో బైపోల్ అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానా మళ్లీ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నికల కమిషన్కు అఫిడెవిట్ సమర్పించారు. జానాకు హైదరాబాద్ బంజారాహిల్స్ లో రూ.2.73 కోట్ల విలువైన 600 గజాల స్థలం, రూ.33 లక్షల స్థిరాస్తి, రూ.36 లక్షల చరాస్తితో పాటు రెండు తుపాకులు ఉన్నట్లు తెలిపారు. జానా భార్య పేరు మీదరూ.5.31 కోట్ల చరాస్తి, రూ.9.88 కోట్ల స్థిరాస్తి ఉన్నట్లు పేర్కొన్నారు.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..