
అధ్యక్షుడిగా ఆంజనేయులు
జనగామ, మన చౌరాస్తా : జనగామ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిర్వహించగా మూడు పోస్టులకు ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే వచ్చాయి. దీంతో అధ్యక్షుడి బడుగు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా బుక్క బాల భరద్వాజ్, కోశాధికారిగా కొలుపుల యాదగిరిని ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికైనా అధ్యక్షుడు ఆంజనేయులు సంఘ అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తానని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల అధికారులుగా మేకపోతుల ఆంజనేయులు, లాగిశెట్టి కృష్ణమూర్తి, పాము పండరి వ్యవవారించారు.