- ఇప్పటి వరకు 4,727 దరఖస్తులు వచ్చాయ్
- కలెక్టరేట్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం
- ఆన్లైన్, ఆఫ్‌లైన్ అప్లై చేసుకోవచ్చు
- సర్టిఫికెట్లపై సెల్ఫ్, గెజిటెడ్ సంతకం తప్పనిసరి
- జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య
జనగామ, చౌరాస్తా ప్రతినిధి : జిల్లాలోని పాత, కొత్త గ్రాడ్యుయేట్ ఓటర్లంతా తప్పని సరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. జిల్లాలోని పట్టభద్రులంతా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓటు కోసం ఫార–18తో అప్లై చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం ద్వారా వారికి సంబంధించిన సర్టిఫికెట్లను జిరాక్స్‌లు సమర్పించాలని సూచించారు. అయితే వాటిపై సెల్ఫ్, గెజిటెడ్ ద్వారా సంతకాలు తప్పనిసరిగా చేయించాలని పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ ప్రకారం వారివారి ఉన్నతాధికారి ద్వారా ధృవీకరించిన పత్రాన్ని సమర్పించాలన్నారు. ఎక్కడి జిల్లా వారు అక్కడే అనే రూల్ ఏమీ లేదని, ఎవరైనా ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అయితే దరఖాస్తుదారులు 2020 జనవరి 1వ తేదీ నాటికి డిగ్రీ పాసై ఉండాలన్నారు. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 4,727 మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారని, మితగా వారు ఫిబ్రవరి 6వ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు కోసం కలెక్టరేట్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక జనగామ మున్సిపాలిటీలో పెద్ద మొత్తంలో పట్టభద్రులు ఉంటారని వారి కోసం తహసీల్దార్ ఆఫీస్‌లో రెండు సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని 12 మండలాలకు ఇప్పటి వరకు 31 పోలింగ్ బూత్‌లను నిర్ణయించామని, ఓటర్లు సంఖ్య పెరిగితే బూత్ సంఖ్య పెరగవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏఫ్రిల్ 4న తుది జాబితా ప్రటిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్ (రెవెన్యూ), పింకేశ్ కుమార్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి డీపీఆర్వో పల్లవి పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)