- చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి మరోసారి స్కెచ్!
- మళ్లీ క్యాంప్‌కు రెడీ అయిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
- పదవి కోసం మళ్లీ పావులు కదుపుతున్న వైనం
జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమునకు ఆవిశ్వస గండం వెంటాడుతోంది. చైర్ పర్సన్ తీరుపై విసుగు చెందిన కొందరు కౌన్సిలర్లు గతంలో ఆమెపై అవిశ్వాసానికి తెరలేపిన విషయం తెలిసిందే. కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఎన్నికల సాధారణ ఎన్నికలు రావడంతో అంతా సైలెంట్ అయ్యారు. తాజాగా ఎన్నికలు పూర్తి కావడంతో మళ్లీ చైర్ పర్సన్‌పై అవిశ్వాస గళం ఎత్తేందుకు కౌన్సిలర్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కౌన్సిలర్లు గురువారం పట్టణంలో ఓ పాఠశాల ప్రాంగణంలో రహస్య సమావేశం అయినట్టు తెలిసింది.
మూడేళ్లు పూర్తి కావడంతో…
2020 జనవరి 22న జనగామలోని 30 వార్డులకు మున్సిపల్ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 వార్డులు బీఆర్ఎస్, 10 వార్డులు కాంగ్రెస్, 4 వార్డులు బీజేపీ, 3 వార్డులు ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. గెలుపొందిన ముగ్గురు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్పార్టీకి మద్దతు తెలుపడంతో 16 మంది బలంతో ఆ పార్టీకి చెందిన 26వ వార్డుకు చెందిన పోకల జమున చైర్ పర్సన్‌గా ఎన్నికై 2020 జనవరి 27న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరడంతో వారి బలం 18 చేరింది. అయితే పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజు తర్వాత చైర్ పర్సన్ తీరు మార్పు రావడంతో సొంత పార్టీకి చెందిన కొందరు అసంతృప్తితో రగిలిపోయారు. ఈ క్రమంలో చైర్పర్సన్పదవీ కాలం మూడేళ్లు పూర్తికావడంతో ఆమె అవిశ్వానికి రెడీ అయ్యారు. అయితే ఈ మేరకు 2023 ఫ్రిబవరి 3న నాటి అడిషనల్ కలెకర్ట్ ప్రపుల్ దేశాయ్‌కి బీఆర్ఎస్కు చెందిన 11 మంది, కాంగ్రెస్‌కు చెందిన 8 మంది కౌన్సిలర్లు కలిసి చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ వితిపత్రాన్ని అందజేశారు. దీనిపై అప్పట్లో చైర్ పర్సన్ జమున స్టే తెచ్చుకున్నారు. తాజా అది పూర్తి కావడంతో మళ్లీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి రెడీ అవుతున్నారు. శుక్రవారం మరో సారి క్యాంప్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొదట యాదాద్రి లేదా మేడారం వెళ్లి కౌన్సిలర్లు అంతా కట్టు మీద ఉండాలనే ప్రమాణం చేయనున్నట్టు సమాచారం.
చుక్కాని లేని నావలా..
జనగామ మున్సిపాలిటీ పాలకవర్గం చుక్కాని లేని నావలా తయారైంది. బీఆర్ఎస్ పెద్ద మెజార్టీ ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు సాగుతున్నారు. గతంలో కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎంతో కొంత కట్టడి చేసేది. అయితే ఆయనను ఈ ఎన్నికల్లో పక్కన పెట్టి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలోకి దింపిన విషయం అందరికీ తెలిసిందే. పల్లా ఎమ్మెల్యేగా గెలుపొందినా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పొడంతో ఆయన ఇచ్చిన హామీలను ఎలా తీర్చలనే డైలమాలో పడ్డారు. ఇదే సమయంలో కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం అగ్గి రాజేస్తుండడంతో పార్టీలో మరింత చీకలు వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)