
జనగామ, మన చౌరాస్తా : మార్క యాదమ్మ, లక్ష్మీనారాయణ గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారులు మార్క ఉపేందర్ గౌడ్, మార్క నరసింహులు గౌడ్ జనగామ పట్టణంలోని రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మణికుమార్, ముఖ్య సలహాదారుడు భీమరాజు మాట్లాడుతూ జనగామ అమ్మ ఫౌండేషన్ ఆలోచన ఆశయంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మార్క యాదమ్మ, లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఆకలి చావులు లేకుండా చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి నల్ల వినోద్ కుమార్, బింగి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)