
- వీడియో జర్నలిస్ట్ రాంప్రసాద్‌కు జర్నలిస్టుల సంతాపం
- గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున రూ.25 వేల తక్షణ సాయం
హనుమకొండ, మన చౌరాస్తా : గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్టు హరిణి రాంప్రసాద్ మృతదేహానికి మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కు తరలించారు. క్లబ్లో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య తదితరులు రాంప్రసాద్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబసభ్యులను ఓదార్చారు. రాంప్రసాద్ కు నివాళులు అర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, సీనియర్ జర్నలిస్టులు సీహెచ్ సుధాకర్, మెండు రవీందర్, వేముల రాజేశ్వర్ రావు, పొగాకుల అశోక్, బూరం ప్రశాంత్, దొంతు నవీన్, తిరుపతి, రాజు, వేణు, కిషోర్, వీడియో జర్నలిస్టులు తిరుమల్, రామ్ చందర్, సుధీర్, రామరాజు, ప్రదీప్, వాజీద్, రాజు, వంశీ, సుధాకర్, రాజ్ కుమార్, క్లబ్ కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షుడు బొడిగె శ్రీను, ఈసీ మెంబర్లు ఎండీ నయీంపాషా, అంజనేయులు, దిలీప్ తదితరులు రాంప్రసాద్ ఉన్నారు.