స్టేషన్‌ఘన్‌పూర్, మన చౌరాస్తా : తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిసి వారు ముందుగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పనులపై మంత్రితో చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించటానికి దేవాదుల ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రత్యేక చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరుతూ ఉత్తమ్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు కడియం పేర్కొన్నారు.