స్టేషన్‌ఘన్‌పూర్, చౌరాస్తా : అన్ని మతాలను గౌరవించడమే గొప్ప సాంప్రదాయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే క్రిస్మస్ కానుకల పంపిణీ జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని కేర్ గార్డెన్లో శనివారం జరిగింది. స్థానిక ఆర్డిఓ వాసం రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి ఆదర్శంగా నిలిచారన్నారు. అన్ని మతాలను గౌరవించడం మన సంప్రదాయమని ఆ దిశగా అడుగులు వేసిన ఘనత గత ముఖ్యమంత్రి కెసిఆర్ ది అన్నారు. శాంతి సామరస్యాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో మత ఘర్షణలు, కొట్లాటలు ఎక్కడ జరగలేదన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆనవాయితీని కొత్త ప్రభుత్వం కొనసాగించాలన్నారు. క్రైస్తవులు గౌరవంగా తలెత్తుకుని జీవించి పదిమందికి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు అధికంగా ఉన్నారని ప్రేమ, సోదర భావం, కరుణ, దయ, జాలి చూపించే జీవన విధానం జీవులపై, జీవరాశులపై క్రైస్తవులు చూపించాలన్నారు. పాస్టర్లు బాలస్వామి, దేవవరం ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కందుల రేఖ, వరలక్ష్మి జడ్పీటీసీలు శ్రీనివాస్, మారపాక రవి, బొల్లం అజయ్, సింగిల్ విండో చైర్మన్ కరుణాకర్ రావు, ఎంపీటీసీలు బూర్ల లత శంకర్, గుర్రం రాజు, గన్ను నరసింహులు, బెల్లపు వెంకటస్వామి, పాస్టర్ అగస్టియన్ నియోజకవర్గంలోని పాస్టర్లు, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు.