
- 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- క్లియరెన్స్ కోసం కష్టపడ్డ కలెక్టర్, ఎస్పీ
కాళేశ్వరం, మన చౌరాస్తా : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సరస్వతీ పుష్కరాల్లో మూడో రోజు శనివారం కాళేశ్వరం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి త్రివేణి సంఘంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలని కుప్పకూలిపోయాయి. రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతుందని గమనించిన అధికారులు మాత్రం సౌకర్యాలు కల్పనలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శనివారం మహాదేవపూర్ నుంచి కాలేశ్వరం వెళ్లే రహదారిలో సుమారు 7 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
టోల్ గేట్ రద్దు
సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే భక్తుల వాహనాలకు టోల్ గేట్ వసూల్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రద్దు చేశారు. టోల్ గేట్ రుసుముతో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఏర్పడుతుందని గమనించిన కలెక్టర్ భక్తుల వద్ద నుంచి టోల్ వసూలు చేయకూడదని ఆదేశించారు.