kidneys : కిడ్నీలను బేరానికి పెట్టిన కండక్టర్
కరోనా మహమ్మరి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. పట్టణ ప్రాంతాల్లో బతుకుదెరువుకు వచ్చిన రోజువారీ కూలీలు, ప్రైవేట్ సెక్టర్లలో పని చేసే ఉద్యోగులు లాక్‌డౌన్‌తో నానా అవస్థలు పడ్డారు. అనే కంపెనీలు కరోనా ఎఫెక్ట్ తో ఖర్చు తగ్గించుకునే యోచతో ఉద్యోగులను కుదించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది పనులు లేక రోడ్డు పడ్డారు. కొన్ని కంపెనీల్లో జీతాల్లో కోత విధించడంతో ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ఇక లాక్ డౌన్ ఎత్తేసి ఇన్ని రోజులైనా ఆయా కంపెనీలు నిలదొక్కుకునే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇక అందులో పని చేస్తున్న ఎంప్లాయీస్ చాలీచాలని జీతాలతో జీవితాలను వెల్లదీయడం కష్టంగా మారుతోంది. అలా ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్న ఓ కండక్టర్ ఏకంగా తన కిడ్నీలను అమ్ముతానంటూ ఫేస్ పోస్టు పెట్టడం సంచనంగా మారింది.
కర్నాటకకు చెందిన హనుమంత కాలేగర్ బస్ కండక్టర్ పనిచేస్తున్నాడు. కరోనా టైంలో లాక్ డౌన్‌తో పనిలేక ఆయన ఎంతో అస్థలు పడ్డాడు. తీరా లాక్ డౌన్ ఎత్తేసి డ్యూటీలో చేరినా వేతనంలో కోత విధించారు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించడం ఆయనకు కష్టంగా మారింది. కష్టాల కడలిని ఈదలేక తన కిడ్నీలు (kidneys ) అమ్ముతానంటూ ఎకంగా ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఆ పోస్టు అందరినీ కలచివేస్తోంది.