కొమురవెల్లి, మనచౌరాస్తా:కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూల విరాట్ దర్శనం ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ స్వామివారి కల్యాణ మహోత్సవం ఈనెల 29వ తేదీన జరగనుండడంతో స్వామివారి మూలవిరాట్ తోపాటు అమ్మవార్ల మూల విరాట్ లకు పంచ వన్నెరంగులతో అలంకరణ చేయడానికి ఈనెల 22వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మూల విరాట్ దర్శనాలు నిలిపివేసి తిరిగి ఈ నెల 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మూల విరాట్ దర్శనాలను భక్తులకు కల్పించనున్నట్లు తెలిపారు.ఈ వారం రోజులపాటు భక్తులకు ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తామని తెలిపారు. భక్తులు గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని కోరారు.
Related Stories
01/12/2024