బచ్చన్నపేట, మన చౌరాస్తా : కొన్నెను మండలం చేయాలని డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరారు. 26 గ్రామాలతో అతిపెద్ద మండలంగా ఉన్న బచ్చన్నపేటను కొన్నే చుట్టూ పక్కల 10 గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందచేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొత్త మండలం ప్రతిపాదన జిల్లా ఇంచార్జి మంత్రి దృష్టి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొన్నే తాజా మాజీ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్, సాల్వాపూర్ మాజీ సర్పంచ్ బండకింది హరిబాబు గౌడ్, జిల్లెల్ల దయాకర్ రెడ్డి, కొన్నే మాజీ ఎంపీటీసీ అంబాల ఆగయ్య, మాజీ సర్పంచ్ చెవిటి ఆనందం, కొన్నే కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుత్తి సిద్దిరాములు, సాల్వపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు బడేకోల్ శ్రీనివాసరెడ్డి, పిట్టల ఇస్తారి, నాచగోని చంద్రం, యాదవరెడ్డి వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.